ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. లియో అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా మొదలైనప్పటి నుండి శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది. రీసెంట్ గానే కాశ్మీర్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఇక తాజా షెడ్యూల్ ను చెన్నైలో మొదలుపెట్టారు. అక్కడ కొన్ని కీలక సన్నీవేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తరువాత ఫైనల్ షెడ్యూల్ ను హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేస్తున్నారట. అక్కడ భారీ సెట్ లను కూడ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. మొత్తానికి మే వరకూ షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంద. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: