తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి, హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడిన సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకుని , షూటింగ్స్ లోనూ శాకుంతలం మూవీ ప్రమోషన్లలో నూ పాల్గొంటున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకోవడానికి తీవ్ర పోరాటం చేశాననీ , కొన్నిసార్లు తన ఆరోగ్యం మెరుగుపడడం కోసం ఎంతో నిదానంగా ఎదురుచూశాననీ , తాను ప్రేమించే పని తనను.. మరోసారి ఇలా నిలబెట్టిందని భావిస్తున్నాననీ , అలాగే వ్యాధి నుంచి కోలుకుని..తిరిగి సినిమాల్లో పాల్గొనడానికి తాను చేసిన పోరాటం తక్కువ కాదనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























