మీటర్ సినిమా లైన్ అదే

kiran abbavaram about meter movie line

రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రమేశ్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా వస్తున్న సినిమా మీటర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్న ఈసినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. మీటర్ సినిమా పక్కా మాస్ ఎంటర్ టైనర్ అని .. నాకు చిన్నప్పటి నుంచి మాస్ సినిమాలంటే చాలా ఇష్టం. అందువలన అలాంటి సినిమాలు పడినప్పుడు నేను ఇష్టంతో చేయడం వలన ఈజీగా చేసినట్టుగా ఆడియన్స్ కి అనిపిస్తూ ఉంటుంది. హీరో పోలీస్ ఆఫీసర్ కావాలనేది అతని తండ్రి డ్రీమ్. ఆ విషయంలో హీరో తండ్రికి ప్రామిస్ చేస్తాడు. కానీ అతనికి పోలీస్ జాబ్ ఇష్టం ఉండదు. అందువలన అతను ఏం చేశాడనేది పూర్తి ఎంటర్టయిన్మెంట్ తో నడుస్తుంది. ఇది చిన్న సినిమా కాదు. హీరో ప్రతి విషయాన్ని మీటర్ తో ముడిపెడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ‘నా మీటర్లో నేను వెళతాను .. నన్నెవ్వడూ ఆపలేడు’ అన్నట్టుగా ఉంటుంది. అందువల్లనే ఈ టైటిల్ ను సెట్ చేయడం జరిగింది అని చెప్పాడు.

కాగా ఈసినిమాలో అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అతుల్య రవి కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. 2017లోనే కోలీవుడ్ కి పరిచయమైన అతుల్య ఈ సినిమాతో ఇక్కడ ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.