సూపర్ స్టార్ కపుల్ మరో ఉదారత

Mahesh Babu And Namrata Once Again Shows Their Golden Heart,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mahesh Babu And Namrata,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Latest News,Namrata Mahesh Ghattamaneni,IWD 2023,Womens Day,International Women's Day,Women's Day,Women's Day 2023,Mahesh Babu Foundation,Mahesh Babu And Namrata Golden Heart,Mahesh Babu Foundation Latest News,MB For Saving Hearts,Mahesh Babu For Saving Hearts,Mahesh Babu And Namrata Helping,Mahesh Babu And Namrata On Women's Day,International Women's Day 2023,Namrata Shirodkar

సూపర్ స్టార్ మహేష్ బాబు, సతీమణి నమ్రత సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వారు చేసే సాయాలు గురించి పెద్దగా ఎక్కడా చెప్పుకున్న దాఖలాలు కూడా లేవు. చాలా వరకూ పలువురు చెబితేనే బయటకు వస్తుంటాయి. ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అది మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో సామజిక సేవల్లో పాల్గొంటూనే ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తుంటారు.. చిన్న పిల్లలకు ఎలాంటి విపత్తు వచ్చినా తనవంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు.. ఇక ఇప్పటికే వెయ్యికి పైగా గుండె ఆపరేషన్ లు చేయించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు ఈ స్టార్ కపుల్. తాజాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని లేడీ ఏవియేషన్ స్టూడెంట్ కి ప్రత్యేకంగా లాప్ టాప్ ని అందించడంతో పాటు ఆమె విద్యా ఖర్చులను కూడా అందించేందుకు ముందుకు వచ్చారు నమ్రతా మహేష్. ఆ విధంగా సూపర్ స్టార్ దంపతులు మరొక్కసారి తమ ఉదారతని చాటుకోవడంతో అందరూ ప్రశంసలు కురిపించారు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక రాజమౌళి తో కూడా మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.