న్యాచురల్ స్టార్ నాని హీరగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోన్నారు. ఈసినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే దసరా సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈమధ్య రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈసినిమా నుండి మూడో పాటను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. చమ్కీల అంగీలేసి అనే ఫోక్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే తాజాగా ఈపాటకు సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేశారు. రామ్ మిరియాల, ఢీ కలిసి పాడిన ఈ సాంగ్ ని కాసర్ల శ్యామ్ రచించారు. ఫుల్ సాంగ్ ను 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























