మైత్రీ మూవీస్ చేతిలో కోనసీమ థగ్స్- భారీ స్థాయిలో రిలీజ్

Mythri Movie Makers to Release Konaseema Thugs Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Mythri Movie Makers,Mythri Movie Makers Latest News,Mythri Movie Makers New Movie News,Mythri Movie Makers Upcoming Film News,Konaseema Thugs,Konaseema Thugs Movie,Konaseema Thugs Telugu Movie,Konaseema Thugs Movie Latest News,Konaseema Thugs Telugu Movie Live Updates

శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంది. ఇక మరోవైపు ఇటీవలే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి పేరిట పంపిణీ రంగంలోకి కూడా ప్రవేశించారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హ్రిదు హరూన్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘కోనసీమ థగ్స్’. సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ తనయురాలు రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో నిర్మించారు. ఆద్యంతం ఉత్కంఠ రేపేలా రూపొందిన కోనసీమ థగ్స్ సంబంధించి ట్రైలర్, పోస్టర్స్, అమ్మన్ సాంగ్ చూసి ఇంప్రెస్ అయ్యి తెలుగు వెర్షన్ ను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి ద్వారా అన్ని ఏరియాల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.

ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన కోనసీమ థగ్స్ ఇటీవల విడుదలైన అమ్మన్ పాటతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో సినిమా పట్ల మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మైత్రి సంస్థ జత కలవడంతో, చిత్రం భారీ స్థాయిలో ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానుంది. చిత్ర బృందం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఈ నెల 19న నిర్వహించనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.