మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు బెల్లంకొండ గణేష్. అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. రాకీ ఉప్పలపాటీ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సార్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దీంతో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచగా, ఫస్ట్ సింగిల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ పై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను మార్చి 10 వ తేదీకి ఫిక్స్ చేశారు. ఈమేరకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో సినిమాలో నటించే ప్రధాన తారాగణం అంతా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get Ready to witness the Story of Student SUBBU standing against a Vicious Complot! 🔁💥#NenuStudentSir! Worldwide in Theatres from March 10th ✅#NSSonMarch10th 🔥#GaneshBellamkonda @avantikadassani @NaandhiSATISH #RakhiUppalapati #MahathiSwaraSagar @adityamusic pic.twitter.com/lFtZ0moInd
— 𝐒𝐕𝟐 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 (@SV2Ent) February 17, 2023
కాగా ఈసినిమాలో అవంతిక దస్సాని ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా సముద్రఖని, సునీల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు నటిస్తున్నారు. ఈసినిమాను నాంది వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించిన ఎస్‌వీ2 ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాడి.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































