శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా#SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. #SSMB 28 మూవీఒక షెడ్యూల్ హైదరాబాద్ లో సారథి స్టూడియోలో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఓ ఓల్డ్ మోడల్ ఇల్లు సెట్ లో కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#SSMB 28 మూవీ తదుపరి షెడ్యూల్ కోసం నగర శివార్లలో అత్యంత భారీ సెట్ ను రూపొందిస్తున్నట్టు , ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షూటింగ్ కోసం దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో భారీ సెట్ రూపొందుతున్నట్టు సమాచారం.ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఇంత భారీ సెట్ నిర్మాణం చేయలేదని టాలీవుడ్ టాక్ . కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సెట్ లో కేవలం ఒక్క ఫ్లోర్ మాత్రమే ఉండడం విశేష. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు , హిందీ, తమిళ , మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























