ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్30 సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ప్రకటించడానికి మాత్రం ఎప్పుడో ప్రకటించినా కూడా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి లేట్ అయింది. మధ్యలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్టు పలు వార్తలు వచ్చినా అవి వార్తలు గానే మిగిలిపోయాయి. ఇక ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు తెరపైకి వస్తున్నాయి కానీ.. షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ను ఈ నెలలోనే అధికారికంగా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఒక చిన్న షెడ్యూల్ ను కూడా ఈనెలలోనే ప్రారంభించనున్నారట. చూద్దాం మరి ఈనెలలో అయనా ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేస్తారేమో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతుంది అంటూ ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























