దసరా బరిలో హరి హర వీరమల్లు?

Hari Hara Veera Mallu Movie New Release Plan,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie Updates,Hari Hara Veera Mallu Telugu Movie Latest News,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Hari Hara Veera Mallu Movie Shooting Updates,Hari Hara Veera Mallu Telugu Movie Shooting Latest News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. పవన్ కెరీర్ లోనే వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇదివ‌ర‌కెన్నడూ క‌నిపించ‌ని పాత్రలో సంద‌డి చేయ‌బోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే విడుద‌లైన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ పై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి షూటింగ్ కరెక్ట్ గా జరుగిఉంటే ఈసినిమా ఈపాటికే రిలీజ్ అయిపోయిఉండేది. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ కూడా వాయిదా పడుతూ వస్తుంది. దానికి కారణం పవన్ కూడా మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉండటం అని చెప్పొచ్చు. ఇక ఎలాగోలా ఈసినిమాను ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు మేకర్స్. ఫ్యాన్స్ కు సమ్మర్ లో ఖచ్చితంగా వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ఈసినిమా దసరా బరిలో దిగే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవుతుండటంతో సమ్మర్ కు కష్టం కాబట్టి దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కు మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.