హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది .ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సలార్ మూవీఇప్పటికే 85 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభించారు. 2023 కొత్త ఏడాది తొలిరోజు అంటే జనవరి 1న ఈ సినిమా ట్విట్టర్‌లో భారీగా ట్రెండ్ అవుతోంది. సాల్ నహీ సలార్ హై అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ #SaalNahiSalaarHai ను ప్రభాస్ అభిమానులు.ట్రెండ్ చేస్తున్నారు అంతేకాదు..2023 సంవత్సరాన్ని ప్రభాస్ అభిమానులు సలార్ సంవత్సరంగా ప్రకటించేశారు. సోషల్ మీడియాలో అభిమానులు సలార్ సినిమాను ట్రెండ్ చేయడం ద్వారా ఆ సినిమాపై తమకు ఉన్న ఆసక్తి , ఆతృతను చాటుకున్నారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తొలి సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























