ధమాకా 11 రోజుల కలెక్షన్స్ – 100 కోట్లకు చేరువలో

Ravi Teja's Dhamaka Movie 11 Days Worldwide Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Dhamaka Telugu MovieLatest News,Dhamaka Movie Collections,Dhamaka Collections,Dhamaka Telugu Movie Collections,Ravi Teja,Dhamaka Movie 11 Days Collections,Dhamaka Telugu Movie 11 Days Worldwide Collections,Dhamaka Movie 11 Days Areawise Collections,Sreeleela

మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమత్రం తగ్గించట్లేదు. రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూనే పోతుంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. రవితేజ కు కలిసొచ్చే మాస్ తరహా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రవితేజ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఫ్యాన్స్ కోరుకుంటారో అలాంటి ఎలిమెంట్స్ ఈసినిమాలో కావాల్సినవన్నీ ఈసినిమాలో ఉండటంతో ఈసినిమాకు అంత ఆదరణ లభిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే ఈసినిమా 10 రోజుల్లో నాన్ రాజమౌళి రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు 11 రోజుల్లో ఈసినిమా 94 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. మరి ఇంకో రెండు రోజుల్లో ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది అని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుస సినిమాలతో బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ధమాకా ఇప్పటికే సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తన కొత్త సినిమాలను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు.ప్రస్తుతం రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రవితేజ లిస్ట్ లో ఉండగా.. అందులో రావణాసురుడు సినిమా ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలుపెట్టగా.. టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంకా హీరోగా నటిస్తూనే మరోపక్క వేరే సినిమాలో కీలక పాత్రల్లో నటించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే బాబీ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 18 =