మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆచార్య ఇంకా గాడ్ ఫాదర్ సినిమాలు రాగా వాటిలో ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టినా.. గాడ్ ఫాదర్ సినిమా మాత్రం సూపర్ హిట్ ను అందించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దర్శకుడు బాబీ చిరు కాంబినేష్ లో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకులు మందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ సింగిల్ గా బాస్ పార్టీ అనే పాటను రిలీజ్ చేయగా ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేశారు. శ్రీదేవి చిరంజీవి అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ ని జాస్ ప్రీత్ జాజ్, సమీరా భరద్వాజ్ పాడగా దేవిశ్రీప్రసాదే లిరిక్స్ అందించడం విశేషం. ఈ సాంగ్ యువతతో పాటు మాస్ ఆడియన్స్ సైతం ఆకట్టుకునేలా ఉంది.
Here’s the Rocking Combo & their Rocking Love Melody ❤️🔥#SrideviChiranjeevi from #WaltairVeerayya out now💥
– https://t.co/k0kSSOSfxzMegastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @JaspreetJasz #SameeraBharadwaj @Sekharmasteroff @SonyMusicSouth pic.twitter.com/t6HtPCjUH9
— Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2022
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























