మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రవితేజ ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో గ్రాండ్ గా రూపొందిన ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా నుండి వచ్చిన పాటలు అయితే ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ తో వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ట్రైలర్ ను 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించారు.

ఈ సినిమాలో ఈసినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































