మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఆ న్యూస్ ఏదో సినిమా న్యూస్ కాదు.. అదేంటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా ఉపాసనల గురించి. రామ్ చరణ్-ఉపాసనల వివాహం జరిగి చాలా సంవత్సరాలు జరిగిన సంగతి తెలిసిందే కదా. చరణ్ తోటి హీరోలు అయిన అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు ఇప్పటికే ఇద్దరేసి పిల్లలు పట్టారు. వారు పెద్దవాళ్లు కూడా అయిపోతున్నారు. ఈనేపథ్యంలో మెగా అభిమానులు కూడా చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా అని ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని రూమర్లు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారని.. ఉపాసన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్ తో మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. ఈసినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































