ఈమధ్య కాలంలో హీరోలు కూడా పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పాత్ర డిమాండ్ చేస్తే చాలు పాత్ర నిడివిని పట్టించుకోకుండా పలు రోల్స్ లో చేయడానికి సిద్దమవుతున్నారు. ఈనేపథ్యంలోనే రవితేజ హీరోగా బిజీగా ఉంటూనే మరోవైపు వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈమధ్యనే ఈసినిమా టైటిల్ ను కానీ, చిరు లుక్ ను కానీ రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే రవితేజకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. మరోవైపు అభిమానులు కూడా రవితేజ అప్ డేట్ గురించి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. దీనిలో భాగంగానే మేకర్స్ సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక చెప్పినట్టే తాజాగా రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు.
Unveiling the HIGH VOLTAGE MASS EXPLOSION 🔥
Mass Maharaja @RaviTeja_offl‘s first look teaser from #WaltairVeerayya out now!
– https://t.co/DJU6adOfRCMegastar @KChiruTweets @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/gAjTlnH8Pn
— Mythri Movie Makers (@MythriOfficial) December 12, 2022
ఈమధ్య కాలంలో హీరోలు కూడా పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పాత్ర డిమాండ్ చేస్తే చాలు పాత్ర నిడివిని పట్టించుకోకుండా పలు రోల్స్ లో చేయడానికి సిద్దమవుతున్నారు.
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ముందు నుండీ చెబుతున్నట్టే ఈసినిమాను సంక్రాంతి బరిలోనే దించుతున్నారు. రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమాను జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























