వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో దేశం లోనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.తాజాగా ఈ మూవీ సెట్ లో సీనియర్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు సందడి చేశారు . ప్రభాస్ తో కలిసి లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు వున్న ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు తాజాగా ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ K మూవీ సెట్ లో సందడి చేస్తుండటం అభిమానులని ఆకట్టుకుంటోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































