అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా హిట్2. ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుండగా.. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. టీజర్, ట్రైలర్ లను బట్టి ఒక యువతి మర్డర్ కేసు మిస్టరీని ఛేదించడం కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ కి, ఆ హత్యతో అనేక హత్యలు ముడిపడి ఉన్నాయనే సంగతి తెలుస్తుంది. ఆ కేసులను ఎలా సాల్వ్ చేశాడన్నది ఈసినిమా కథ అన్నది అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. ఈనేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంటుకి చీఫ్ గెస్టు ఎవరన్నది ఊహించండి అంటూ సస్పెన్స్ లో పెట్టారు. ఇక తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే అతిథి ఎవరో చెప్పేశారు. దర్శక ధీరుడు రాజమౌళి ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వస్తున్నట్టు తెలిపారు.
The pride of India and ace director @ssrajamouli Garu would be gracing the Grand Pre Release Event of #HIT2 on November 28th and making it extra special.#HIT2onDec2 @AdiviSesh @NameisNani @KolanuSailesh @tprashantii @Meenakshiioffl @saregamasouth pic.twitter.com/iBMLTWz2YI
— Wall Poster Cinema (@walpostercinema) November 26, 2022
కాగా ఈసినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించనుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























