టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిద్యమైన సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈఏడాది ఇప్పటికే అశోక వనంలో అర్జున కళ్యాణం రీసెంట్ గా ఓరి దేవుడా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్ ను అందించాయి. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒక సినిమానే ధమ్కీ. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈ సినిమా పోస్టర్ ని విశ్వక్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “నో అలెర్ట్ ఓన్లీ ధమ్కి” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. విశ్వక్ సేన్ కనుబొమ్మలను ఎగరేస్తూ.. కొంచెం స్టైలిష్‌గా, కొంచెం సీరియస్‌గా చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

కాగా ఈసినిమా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథని.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























