సూపర్ స్టార్ కృష్ణ మృతి ప్రముఖుల సంతాపం

Celebrities Mourn Superstar Krishnas Demise, Superstar Krishnas Demise, Celebrities Mourn, Krishnas Demise, Superstar Krishna Has Passed Away, Krishna Health Update, Krishna Health Latest Update, Superstar Krishna, Mahesh Babu’s father, veteran actor Superstar Krishna, Superstar Krishna visited Continental Hospital, Continental Hospital, Superstar Krishna Had a cardiac arrest, Mahesh Babu's family, Ramesh Babu, Indira Devi, Tollywood’s Legendary Veteran Actor, Hero Krishna, Tollywood’s Veteran Actor, Legendary Telugu Actor, Tollywood’s Superstar, Krishna Movies, Krishna Latest Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

గత రెండేళ్ల నుండి ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలను కోల్పోయాం. ఇక రీసెంట్ గానే సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ను కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మరో లెజెండరీ నటుడిని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు ఇండస్ట్రీ మరోసారి విషాదంలో మునిగిపోయింది. నిన్న సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ఇక వైద్యులు కూడా కృష్ణ పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. అంతేకాదు 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని చెప్పారు. ఇక ఈలోపే కృష్ణ తుదిశ్వాస విడిచారు. దీంతో అటు ఇండస్ట్రీతో పాటు అభిమానులు కూడా కృష్ణ మృతిపట్ల విషాదంలో మునిగిపోయారు. ఈనేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్యం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత కృష్ణ మృతిపట్ల స్పందిస్తూ.. చిత్రసీమలో సూపర్ స్టార్ అన్న బిరుదుకి సార్ధకత చేకూర్చిన కృష్ణ గారు తుది శ్వాస విడిచారని విషయం ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన తరువాత కోలుకుంటారని ఆశించానని, కానీ ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అన్నారు. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండే వారిని, మద్రాసులో ఉన్నప్పటి నుంచీ మా కుటుంబంతో ఆయనకు చక్కని అనుబంధం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేత కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారని గుర్తు చేశారు. చిన్న పాత్రలు పోషించిన కృష్ణ గారు జేమ్స్ బాండ్, కౌ బాయ్ వంటి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారని తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేసుకున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సినిమారంగం క్షేమాన్ని కాంక్షించే కృష్ణ గారి మరణం తెలుగు చలన చిత్రసీమకు తీరని లోటని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన కుమారుడు మహేష్ బాబు గారికి సభ్యులకు నా తరఫున తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్.

ఇక మరోవైపు తలైవా రజినీ కాంత్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సంతాపం తెలియచేశారు. కృష్ణ గారి మరణం తెలుగు పరిశ్రమకు తీరని లోటు.. ఆయనతో కలిసి నేను మూడు సినిమాలు చేశాను.. అది ఎప్పటికీ మరిచిపోలేనిది.. తన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.