హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార మూవీ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాంతార మూవీ కర్ణాటక లో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా కన్నడలో కాంతార మూవీ టికెట్స్ ఒక కోటి అమ్ముడు అయ్యాయి. కర్ణాటక లో కాంతార కోటి టికెట్లు అమ్ముడు పోయాయన్న విషయాన్ని , ఆ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా తెలిపింది. విడుదలై ఇన్నిరోజులు అవుతున్న కాంతార సినిమా సందడి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























