ప్రేమను బయటపెట్టిన తమిళ్ స్టార్స్

manjima mohan and gautham karthik make their relationship official, manjima mohan and gautham karthik relationship, gautham karthik relationship, manjima mohan relationship, Actor gautham karthik, Actress manjima mohan, manjima mohan Latest Movie, manjima mohan's Upcoming Movie, manjima mohan and gautham karthik Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు. ఏ హీరో ఏ హీరోయిన్ కు కనెక్ట్ అవుతాడో, ఏ హీరోయిన్ ఏ హీరోకు కనెక్ట్ అవుతుందో చెప్పడం కష్టం. కొంతమంది ప్రేమలో ఉన్నా కానీ పెళ్లి వరకూ అది కన్ఫామ్ చేయరు. అయితే ఏదో ఒక రకంగా వార్తలు వస్తూనే ఉంటాయి. అయినా కూడా నోరు విప్పే పరిస్థితి ఉండదు. ఇక ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు చాలానే ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడు మరో జంట బయటకు వచ్చారు. ఆ జంట ఎవరో కాదు తమిళ్ హీరో హీరోయిన్లు గౌతమ్ కార్తిక్-మంజిమా మోహన్ ది. గత కొంతకాలంగా మంజిమా మోహన్, గౌతమ్ కార్తిక్ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పటివరకూ ఈవార్తలపై ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ఇద్దరూ. తమ సోషల్ మీడియా ద్వారా ఆవిషయాన్ని కన్ఫామ్ చేశారు. వీరిద్దరూ కలిసి 2019లో దేవరత్తం అనే సినిమాలో కలసి నటించారు. అప్పటి నుండి వీళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక ఇప్పుడు తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు.

 

View this post on Instagram

 

A post shared by Gautham Karthik (@gauthamramkarthik)

కాగా కడలి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ కార్తిక్‌. ప్రస్తుతం అయితే కోలీవుడ్‌లో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మంజిమా మోహన్. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా లీలా పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇద్దరూ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.