సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. సినిమా జయాపయజాలను సైతం పట్టించుకోకుండా రజనీ కాబట్టి మేకర్స్ కూడా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అంతేకాదు రజనీకాంత్ యంగ్ డైరెక్టర్స్ తో కొత్తగా ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అయితే రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇటీవల రజనీకాంత్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆవార్తలను కన్ఫామ్ చేస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది. రజనీకాంత్ లైకా బ్యానర్ లో రెండు సినిమాలు చేయడం కన్ఫామ్ అయిపోయింది. ఇక ఈరెండు సినిమాల పూజా కార్యక్రమాలు కూడా నవంబర్ 5వ తేదీన చెన్నైలో ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రజనీకాంత్ రోబో సీక్వెల్ తో పాటుగా దర్బార్ సినిమాల్లో నటించారు.
ఇక కొత్తగా తెరకెక్కించే సినిమాలలో ఒక దాన్ని డాన్ సినిమా దర్శకుడు శిబి చక్రవర్తి రూపొందిస్తారని, మరో సినిమాను పెరియసామి డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఉండబోతున్నాయట. ఇక ఈసినిమాలకు సంబంధించిన వివరాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































