కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి అబ్బాయి గా ఇమేజ్ తెచ్చుకున్న కిరణ్ కు అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. చిన్నసినిమాలే కాదు.. పెద్ద పెద్ద బ్యానర్స్ నుండి సైతం కిరణ్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు తన తరువాత సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం కిరణ్ నుండి వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈసినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ లాంటివి కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈమధ్య ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఒక్కటి కూడా రాలేదు. అంతేకాదు కిరణ్ నుండి వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కూడా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే మేకర్స్ సర్ ప్రైజింగ్ గా అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అప్ డేట్ ఇవ్వనున్నారు. ఈసినిమా రిలీజ్ డేట్ ను రేపు సాయంత్రం 5గంటల 2 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈసందర్బంగా ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు చిత్రబృందం.
The date is locked 🔒 for the release of #VinaroBhagyamuVishnuKatha ✨
Stay tuned…Announcement tomorrow @ 5:02 PM 💫#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram@kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @ItsChavan @GA2Official pic.twitter.com/GOAy9GXKpo
— GA2 Pictures (@GA2Official) October 28, 2022
కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























