ఓరి దేవుడా గుండెల్లోనా మెలొడీ సాంగ్ రిలీజ్

Gundellona Song from Ori Devuda Released, Gundellona Song Released, Ori Devuda Gundellona Song Released, Gundellona Song, Venkatesh Dagubatti, Vishwak Sen, Mithila Palkar, Asha Bhat, Ashwath Marimuthu, Gundellona Song Out Now, Ori Devuda, Ori Devuda Telugu movie, Ori Devuda New Update, Ori Devuda Telugu Movie New Update, Ori Devuda Movie, Ori Devuda Latest Update, Ori Devuda Movie Updates, Ori Devuda Telugu Movie Live Updates, Ori Devuda Telugu Movie Latest News, Ori Devuda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. రీసెంట్ గానే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తో మంచి విజయాన్ని అందుకున్నాడు విశ్వక్ సేన్. ఈసినిమాలో వయసు పెరుగుతున్నా పెళ్లి కానీ వ్యక్తి పాత్రలో సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా ప్రస్తుతం ఓరి దేవుడా అనే సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడువలే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు ఈసినిమాకు కూడా దర్శకత్వంలో వహించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. మంచి వ్యూస్ తో నెం.1 ట్రెండింగ్ లో సైతం దూసుకుపోయింది. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేక్ర్స్ ఈ సినిమాలోని ‘గుండెలోనా’ అంటూ సాగే మెలోడియస్‌ సాంగ్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాటను అనిరుధ్ ఆలపించగా ప్రస్తుతం ఆపాట కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.

కాాగా ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్‌ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి విధు. ఈసినిమా అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.