అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్. కానీ మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఆ తరువాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా అఖిల్ కు పరాజయాలనే అందించింది. అయితే ఫైనల్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈసినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సురేందర్ రెడ్డి సినిమా అంటే అటు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు స్టైయిలీష్ గా మేకింగ్ ఉంటుంది. అందుకే ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఎప్పటినుండో ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. అయితే సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చినట్టే తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈసినిమా చివరి షెడ్యూల్ మొదలుపెట్టినట్టు సమాచారం. బల్లారి లో ఈసినిమా షెడ్యూల్ ను ప్రారంభించినట్టు.. ఈ షెడ్యూల్ లో మమ్ముట్టి తో పాటు ఇతర నటీనటులతో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.
కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























