డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీపై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ బరిలో నిలవాలని హాలీవుడ్ అభిమానులు సైతం కోరుకున్నారు. కానీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఆర్ ఆర్ మూవీ ని ఆస్కార్ కు ఎంపిక చేయలేదు. ఫర్ యువర్ కన్సిడరేషన్ విభాగంలో అన్ని కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం క్యాంపెనింగ్ చేసుకోనుంది. బెస్ట్ మోషన్ పిక్చర్: డివివి దానయ్య, బెస్ట్ డైరెక్టర్ : ఎస్ఎస్ రాజమౌళి, బెస్ట్ యాక్టర్ : జూ. ఎన్టీఆర్ , రామ్ చరణ్ .. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవగన్ , బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు , బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : కీరవాణి, బెస్ట్ ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ , బెస్ట్ సౌండ్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్స్ బరిలో నిలవనుందని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























