మెగా బ్యాక్ గ్రౌండ్ తో, మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అల్లు శిరీష్. ఇక కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో అలరించిన అల్లు శిరీష్ నుండి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. కరోనా కారణంగా కాస్త లేట్ అయినా.. కరోనా ప్రభావం లేకపోయినా కూడా తన కొత్త సినిమా రిలీజ్ కు నోచుకోలేకపోయింది. అయితే ఫైనల్ గా ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న సినిమా రిలీజ్ కు సిద్దమైంది. రాకేశ్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. ఎందుకంటే ప్రేమంట సినిమా టైటిల్ ను మార్చారు. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ ను కూడా రీసెంట్ గానే ప్రకటించారు. నవంబర్ 4వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మళ్లీ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మధ్య కెమస్ట్రీ యూత్ కు ఆకట్టుకునేలా ఉంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ జోనర్ కు తగ్గట్టుగా సన్నివేశాలు కూడా కాస్త బోల్డ్ గానే ఉన్నాయి. ఇక వెన్నెల కిషోర్, అలానే సునీల్ కామెడీకి ఈసినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























