సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి,దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక ఈ సంవత్సరం బెంగళూరులో జరిగింది. ఈ అవార్డ్స్ వేడుకలో పుష్ప 6 కేటగిరీస్ లో అవార్డ్స్ గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. బెస్ట్ యాక్టర్- అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్- సుకుమార్, బెస్ట్ మ్యూజిక్- దేవి శ్రీ ప్రసాద్, బెస్ట్ లిరిసిస్ట్- చంద్రబోస్, బెస్ట్ సపోర్టింగ్ రోల్ – జగదీష్, బెస్ట్ తెలుగు మూవీ వంటి కేటగీరీల్లో పుష్ప: ది రైజ్ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడి అవార్డును అందుకుంటున్నప్పుడు అల్లు అర్జున్ తగ్గెదేలే డైలాగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. సైమా అవార్డ్స్ వేడుకలో కమల్ హాసన్ , అల్లు అర్జున్, యష్ , రణ్వీర్ సింగ్, విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























