దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో కూడా రాబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు దగ్గుబాటి అభిరామ్. అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో అహింస సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇక ఈసినిమా రెండు రోజుల క్రితమే షూటింగ్ ను పూర్తిచేసుకుంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్స్ లేకుండానే షూటింగ్ ను పూర్తిచేశారు మేకర్స్. కేవలం ఒక్క ప్రీ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు షూటింగ్ కూడా పూర్తవ్వడంతో ఇక నుండి ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను సెప్టెంబర్ 9వ తేదీన 9గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘అహింస’ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో అభిరామ్ ముఖానికి ఒక గోనె సంచి కట్టి అతని చేతులు వెనక్కి కట్టేసి ఉండగా… అతని ముఖం నుంచి రక్తం కారుతుంది. ఈపోస్టర్ లో తేజ మార్క్ కనిపిస్తుంది.

కాగా ఈసినిమాలో గీతికా హీరోయిన్ గా నటిస్తుండగా.. అలాగే రజత్ బేడీ, సదా, రవి కాలే అలాగే కమల్ కామరాజు తదితరులు నటిస్తున్నారు. ఇంకా సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్న ఈసినిమాకు ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























