ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి

Sharwanand Thanks Prabhas For Supporting His Film,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Sharwanand,Hero Sharwanand,Sharwanand Upcoming Movies,Sharwanand New Movie Updates,Sharwanand Latest Movie Updates,Sharwanand Thanks Prabhas,Sharwanand Upcoming Movies,Sharwanand New Movie Updates,Sharwanand about Prabhas,Sharwanand Next Projects

విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేయడంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా ఎప్పుడూ ముందుంటాడు. అలాంటి శర్వాకు ఈమధ్య సరైన హిట్ పడింది లేదు. రీసెంట్ గా వచ్చిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమా కాస్త ఊరట నిచ్చింది. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. శ్రీకార్తిక్ దర్శకత్వంలో శర్వా హీరోగా వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. నిజానికి ఈసినిమా చాలా లేట్ గానే రిలీజ్ అవుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు కానీ రిలీజ్ అవ్వడానికి మాత్రం చాలా రోజులు టైమ్ తీసుకుంది. ఫైనల్ గా ఈ నెల 9వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాతలతో పాటు శర్వానంద్ .. రీతూ వర్మ .. అమల అక్కినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ఈసినిమా టైటిల్ చూసి ఇది మదర్ సెంటిమెంట్ సినిమా .. ఎమోషన్స్ భారీగా ఉంటాయని భయపడవలసిన పనిలేదు. నా పాత్రతో పాటు వెన్నెల కిశోర్ .. ప్రియదర్శిల నుంచి కూడా కావలసినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ చేయడానికి హీరో కార్తీ ముందుకు రావడం .. ఆ పాటను పాడటం గొప్ప విశేషం. అలాగే ప్రభాస్ గారికి ట్రైలర్ పంపించగానే వెంటనే పోస్ట్ చేశారు. అలా ట్రైలర్ జనంలోకి వెళ్లడానికి కారణమైన ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. తప్పకుండా ఈ సినిమా నా కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలబడుతుందని చెప్పుకొచ్చాడు.

కాగా ఈసినిమాలో రీతూ వ‌ర్మ‌ హీరోయిన్ గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి లతో పాటు.. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.