పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖుల , రాజకీయ నేతల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లు వెత్తాయి. సూపర్ హిట్ మూవీస్ జల్సా , తమ్ముడు స్పెషల్ షోస్ తో అభిమానులు తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. తన పుట్టినరోజుని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటూ.. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ ఉంటాననీ , ఈ యేడాది కూడా అదే విధంగా జన్మదినం సందర్భంగా ఆధ్యాత్మిక సంబంధ కార్యక్రమంలో పాల్గొన్నాననీ , ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకోవడం తన బాధ్యతగా భావిస్తాననీ , తనపై ఉన్న వాత్సల్యంతో, అభిమానంతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ మన:పూర్వక కృతజ్ఞతలనీ , తనను తమ కుటుంబంలో ఒకడిగా చూసుకొంటున్న అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తమదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లడించారనీ , తనపై అమూల్యమైన వాత్స్యల్యాన్ని కనబరుస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాననీ , రక్త దాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి తన జన్మదిన కార్యక్రమానికి ఒక ప్రయోజనం కలిగించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలనీ పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































