వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతారామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సీతారామం మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Kudos Team #SitaRamam 💐@VyjayanthiFilms @AshwiniDuttCh @SwapnaDuttCh #PriyankaDutt @dulQuer @mrunal0801 @iamRashmika @hanurpudi @iSumanth @Composer_Vishal #PSVinod pic.twitter.com/BEAlXhWPa3
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 27, 2022
విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంది.సీతారామం మూవీ ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందంపై సోషల్ మీడియా ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు.సీతారామం చూశాననీ , ఒక చక్కటి ప్రేమ కావ్యం చూసిన అనుభూతి కలిగిందనీ , విభిన్నమైన స్క్రీన్ ప్లేతో ఈ ప్రేమకథని ఆవిష్కరించిన విధానం తనకెంతో నచ్చిందనీ , సినీ ప్రేక్షకుల మనసుల పై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వనీదత్, స్వప్నాదత్, ప్రియాంకాదత్, ఒక ప్యాషన్‌తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి కలకాలం నిలిచే సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్‌కి, అన్నింటికన్నా ముఖ్యంగా రామ్–సీత పాత్రలకు ప్రాణం పోసిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ , సూత్రధారి పాత్ర పోషించిన రష్మిక మందన్న.. ఇతర నటీనటులు, సాంకేతిర నిపుణులకు శుభాకాంక్షలనీ , .ప్రేక్షకుల మది దోచిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను, రివార్డ్‌లను జాతీయ స్థాయిలో గెలవాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాననీ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























