75 కోట్ల క్లబ్ లో సీతారామం

sita ramam movie enters in 75 crore club, Sita Ramam Box office Collections, sita ramam enters in 75 crore club, 75 crore club, Sita Ramam Collections, sita ramam movie, sita ramam movie Latest News And Updates, Dulquer Salmaan Sita Ramam movie Collections, Sita Ramam has grossed 75 crore club worldwide, sita ramam collections till now, sita ramam box office collections worldwide, sita ramam total collections worldwide, Tollywood Movie Updates, Tollywood Latest News, Telugu Filmnagar, Telugu Film News 2022,

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు తెరకెక్కించడంలో హను రాఘవపూడి ఎప్పుడూ ముందుంటాడు. ఇక ఇప్పుడు మరోసారి సీతారామం సినిమాతో తను ప్రేమకథలు తీయడంలో ఎక్స్పర్ట్ అని నిరూపించాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సీతారామం. ఈసినిమా ఈనెల ఆగష్ట్ 5వ తేదీన రిలీజ్ అయి క్లాసిక్ హిట్ ను కొట్టింది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే ఈసినిమా మంచి లాభాలను సొంతం చేసుకుంది. కొద్దిరోజుల క్రితమే ఈసినిమా 50 కోట్ల క్లబ్ లో చేరగా.. తాజాగా 75 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఈసందర్భంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆడియన్స్ కృతజ్ఞతలు తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ ఏకకాలంలో రిలీజ్ చేశారు. ఇక్కడ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈసినిమాను నార్త్ లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. నార్త్ లో సెప్టెంబర్ 2 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఇప్పటికే పలు తెలుగు సినిమాలు నార్త్ బాక్సాఫీస్ తమ హవాను కొనసాగించాయి.. రీసెంట్ గా రిలీజ్ అయిన కార్తికేయ2 కూడా ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మరి ఈసినిమా అక్కడ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

కాగా ఈసినిమాను వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.