విభిన్నమైన కథలను ఎంచుకోవడంలోనూ, విభిన్నమైన పాత్రలను చేయడంలోనూ తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇక ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో వచ్చేస్తున్నాడు. ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా కోబ్రా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మంచి అంచనాలను పెంచేశారు. ఇక ఈసినిమాను ముందు నుండి ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ వచ్చారు మేకర్స్. అయితే తరువాత ఈసినిమా రిలీజ్ ను ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అతడే కోబ్రా..రకరకాలుగా రూపం మార్చుకొని వెళ్లడం తెలుసు..చాటుగా మాటేసి కాటేయడమూ తెలుసు..అనే వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది ట్రైలర్. ఇక ట్రైలర్ ను బట్టి విక్రమ్ మరోసారి థ్రిల్ చేయడానికి వస్తున్నట్టు అర్థమవుతుంది. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.
A Genius who breathes numbers for every single second of his Life! 🔥
Here’s #CobraTeluguTrailer 🐍 #Cobra
▶️ https://t.co/5XmFnn9VaL#CobraFromAugust31 ✅@chiyaan @AjayGnanamuthu @7ScreenStudio @arrahman @IrfanPathan @SrinidhiShetty7 @NVR_CinemaOffl @SonyMusicSouth pic.twitter.com/jnqVruAhcu— Seven Screen Studio (@7screenstudio) August 26, 2022
కాగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇర్ఫాన్‌తో పాటు మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























