ప్రతి ఒక్క డైరెక్టర్ కు ఎవరో ఒక హీరోతో చేయాలన్న కోరిక ఉంటుంది. అలానే హీరోలకు కూడా స్టార్ డైరెక్టర్ లతో చేయలన్న కోరిక ఉంటుంది. కానీ రాజమౌళి లాంటి డైరెక్టర్ తో చేయాలంటే అదో కలలానే భావిస్తుంటారు. మరి అలాంటిది రాజమౌళినే ఒక హీరోతో సినిమా చేయాలని ఉంది అని చెబితే.. అది నిజంగా గొప్ప విషయమే. ఇంతకీ రాజమౌళి సినిమా చేయాలనుకుంటున్న హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాను సౌత్ లో రాజమౌళి సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో సౌత్ లో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు రాజమౌళి అండ్ చిత్ర టీం. దీనిలో భాాగంగానే నేడు చెన్నై ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మీరు ఏ తమిళ స్టార్ హీరోను డైరెక్ట్ చేయడానికి ఇష్టపడతారని జక్కన్నను ప్రశ్నించగా…తనకు ఏదో ఒక రోజు సూపర్ స్టార్ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయాలనుందని చెప్పాడు.
కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. మూడుపార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో.. మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































