గత ఏడాది అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్. ఈసినిమాను పెద్దన్న టైటిల్ తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. ఇక ఈసినిమా షూటింగ్ ను నిన్ననే ప్రారంభించారు. ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేసింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటించే నటీనటులను అధికారికంగా ప్రకటించారు. ముందునుండీ అనుకుంటున్నట్టు రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కూడా ఈసినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు. మరి ఈసినిమాలో ఐశ్వర్యరాయ్ హీరోయన్ గా నటిస్తుందన్న వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారికంగా ప్రకటించేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
The cast of #Jailer💥
Welcome on board @meramyakrishnan @iYogiBabu @iamvasanthravi #Vinayakan@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/Umo5DevjWy— Sun Pictures (@sunpictures) August 24, 2022
కాగా ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































