#SSMB28 కు పోకిరి సెంటిమెంట్

Interesting Similarity between #SSMB & Pokiri,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu New Movie Update,Mahesh Babu SSMB28,Mahesh Babu SSMB28 Movie,Mahesh Babu SSMB28 Release Date,SSMB28 Movie,SSMB28 Movie Release Date,SSMB28,SSMB28 Telugu Movie,Pokiri,Pokiri Movie,Pokiri Telugu Movie,SSMB28 Movie Updates,Similarity between SSMB28 And Pokiri,Pokiri Release Date,SSMB28 And Pokiri Release Dates,Trivikram,Pokiri Sentiment For SSMB28,SSMB 28 Release Date Announced,SSMB28 Movie Latest Updates,Mahesh Babu Latest Movie Updates

రీసెంట్ గానే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో హిట్ కొట్టగా తన తరువాత సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ఈసినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో జరుపుకున్నారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈగ్యాప్ లోనే ఫ్యాన్స్ ను రిలీజ్ డేట్ ఇచ్చి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే ఇదే రోజున పోకిరి సినిమా రిలీజ్ అయింది. పోకిరి సినిమా రిలీజ్ అయి పలు సంచలనాలు సృష్టించడంతో ఇక ఇదే రోజున మహేష్ 28 వ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈసినిమా కూడా అదే రేంజ్ లో హిట్ కొడుతుందని అంటున్నారు. చూద్దాం మరి ఈసినిమా ఎలా ఉండబోతుందో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కలయికలో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. పూరీ పంచ్ డైలాగ్స్, మహేష్ యాక్షన్, ఇలియానా గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులోమహేష్ బాబు, ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఇలియానా స్టార్ హీరోయిన్ అయింది. ఇక రీసెంట్ గానే మహేష్ పుట్టిన రోజు సందర్భంగా పోకిరి స్పెషల్ షోస్ ను నిర్వహించారు. ఇక ఇన్నేళ్లయినా కూడా ఈసినిమా స్పెషల్ షోస్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. అంతేకాకుండా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.