స్టార్ హీరోయిన్ సమంత మూడు నెలలలో మూడు పాన్ ఇండియా మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన “యశోద” మూవీ అక్టోబర్ 3వ వారంలో రిలీజ్ కానుందని సమాచారం. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “యశోద” మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“శాకుంతలం ” మూవీని పాన్ ఇండియా మూవీ గా నవంబర్ నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఖుషి”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.“ఖుషి”మూవీ డిసెంబర్ 23 వ తేదీ దక్షిణాది భాషలలో రిలీజ్ కానుందని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































