హ్యాపీడేస్‌తో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన యంగ్ హీరో నిఖిల్ ఆసినిమాలో తన నటనతో, తెలంగాణ యాసతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ సినిమా తరువాత వరుసగా అవకాశాలు అందుకున్నాడు.. అయితే అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయాడు.. ఆ తరువాత స్వామిరారా సినిమాతో తన సినీ కెరీర్ మరో మలుపు తిరిగింది. ఇక అప్పటినుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేస్తూ క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం కార్తికేయ2 సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా అన్ని పనులు పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ఆగష్ట్ 12వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. వాటికి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈసినిమా థియేట్రికల్ ట్రైలర్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ట్రైలర్ ను ఆగష్ట్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
The search for the ultimate truth brings India’s first mystical adventure film!
Keep your expectations high 💥#Karthikeya2 Trailer on August 6th 🔥#KrishnaIsTruth#Karthikeya2onAugust12th@actor_Nikhil @anupamahere @AnupamPKher @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl pic.twitter.com/3Ct51m8K0k
— People Media Factory (@peoplemediafcy) August 2, 2022
ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా… ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: