సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలపై ఎప్పుడూ నెటిజన్లకు ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం సినిమాలు మాత్రమే కాాదు వ్యక్తి గత విషయాల గురించి వార్తల కోసం కూడా ఎదురుచూస్తుంటారు. అందులోనూ నటీనటుల రిలేషన్షిప్స్ గురించి, పెళ్లి గురించి, ప్రెగ్నెన్సీ ఇలాంటి విషయాల గురించి మరింత ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇక ఈమధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు సైతం పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. అవసరమైతే పెళ్లిళ్లు చేసుకొని ఆ తరువాత కొంతగ్యాప్ తీసుకొని మళ్లీ సినీ కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఈమధ్యకాలంలోనే స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి చేసుకొని తల్లి కూడా అయిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కూడా విక్కీ కౌషల్ ను చేసుకొని సెటిల్ అయిపోయింది. రీసెంట్ గా లేడీ సూపర్ స్టార్ నయన తార కూడా పెళ్లి చేసేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బాలీవుడ్ లవ్ బర్డ్స్అలియా భట్, రణబీర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఫైనల్ గా వివాహబంధంలోకి అడుగుపెట్టేశారు. అయితే అలా పెళ్లి అయిందో లేదో అప్పుడే అలియా తల్లి కూడా కాబోతుంది. నిజానికి పెళ్లి తరువాత అలియా బయటకు పెద్దగా కనిపించింది లేదు. మధ్యలో అలియా ఆరోగ్యం బాలేదని అయితే ప్రెగ్నెంట్ అయిఉండవచ్చన్న వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలకు క్లారిటీ వచ్చేసింది. స్వయంగా అలియానే తన సోషల్ మీడియా ద్వారా హాస్పిటల్ లో చెక్ చేయించుకుంటున్న ఫొటో ను పోస్ట్ చేస్తూ మై బేబీ.. కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. దీంతో అలియా అఫీషియల్ కన్ఫామ్ చేసేసింది. మరి కేరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే అలియా పెళ్లి చేసుకోవడం.. తల్లి కావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
View this post on Instagram
కాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈమధ్యనే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు టాలీవుడ్ అగ్రహీరో నాగార్దున కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: