అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటం ఇంకా భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ ఉండటంతో.. ఈసినిమా ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉన్నారు. ఇక పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ రేంజ్ లోనే ఈసినిమా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ తో సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందన్న విషయం అర్థమవుతుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈసినిమా గ్రాఫిక్స్ ను క్రియేట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో ఇప్పటికే పలు స్టార్ హీరో హీరోయిన్లు నటిస్తుండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో దీపికా ఒక అతిథి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అది కూడా బ్రహ్మాస్త్ర చివరిలో కనిపించనుందని.. ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందని సన్నిహితుల నుండి వస్తున్న సమాచారం. ప్రస్తుతానికి అయితే దీపికాకు సంబంధించిన విషయాలు సీక్రెట్ గా ఉంచారని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక దీపికా ఈసినిమాలోనే కాదు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్-నయనతార ప్రధాన పాత్రల్లో వస్తున్న జవాన్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈవార్తల్లో కూడా క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక బాలీవుడ్ తో పాటు దీపికా తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తుంది. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























