పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “జనగణమన”మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక ఆయ్యారు.
“యానిమల్ “హిందీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే నటించనున్నారని సమాచారం .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి కనెక్ట్స్ , శ్రీకర స్డూడియో బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కనున్న “జనగణమన”మూవీ షూటింగ్ జూన్ 4 నుంచి ప్రారంభం కానుందనీ , నాలుగు రోజుల పాటు మొదటి షెడ్యూల్ ముంబైలోనే జరగనుందనీ , అక్కడ నుంచి షూటింగ్ కశ్మీర్ కి షిప్ట్ అవుతుందనీ సమాచారం. “జనగణమన”మూవీ లో హీరోయిన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనీ ,, కశ్మీర్ వార్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా కావడం, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో పూజాహెగ్డే మార్షల్ ఆర్స్ట్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: