విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాఎఫ్3. ఈసినిమా ఈనెల 27వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఈసినిమాపై కూడా మొదటినుండి మంచి అంచనాలే ఉండగా.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ విడుదలైన 24 గంటలో 12.5 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించి యుట్యూబ్ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఫుల్ ఫన్ రైడ్ గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా సాగిన ఈ ట్రైలర్ లో చాలా సర్ప్రైజ్ లు అలరించాయి. అయితే సినిమాలో ఇంతకుమించిన సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయి అంటున్నారు. ఇలా సర్ ప్రైజ్ ఇచ్చే ఎలిమెంట్స్ లో తమన్నా చేసిన హారిక పాత్ర ఒక మేజర్ హైలెట్ గా ఉండబోతుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎఫ్3 కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుందట. ఎఫ్ 2కు మించి హారిక పాత్రని అద్భుతంగా ఎఫ్3లో డిజైన్ చేశాడట అనిల్ రావిపూడి. ఎఫ్ 3 కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరుగుతుంటుందట. నటనకి ఆస్కారం వున్న హారిక పాత్రలో తమన్నా నటన నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. వెంకటేష్- తమన్నా ల మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉండబోతున్నాయి. ”మన ఆశలే మన విలువలు” ఎఫ్3 లో తమన్నా హారిక పాత్ర చెప్పిన క్యాచి డైలాగ్ ఇది. ఈ డైలాగ్ హారిక క్యారెక్టరైజేషన్ లో కీలకంగా వుంటుంది. ఆశలతో మేడలు కట్టే హారికకి సోనాల్ చౌహాన్ పాత్ర పరిచయంతో కథలో బ్రిలియంట్ సర్ ప్రైజ్ రాబోతుంది. ఈ సర్ ప్రైజ్ సినిమాలో ఎక్స్ట్రార్డినరీగా వుండబోతుంది. తమన్నా కెరీర్ లోనే ఎఫ్ 3లో హారిక పాత్ర ది బెస్ట్ గా నిలవనుంది అంటున్నారు మేకర్స్.
కాగా ఈసినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, రఘుబాబు, తులసి తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: