విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయతార లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా చిత్రం కాతువాకుల రెండు కాదల్. ముగ్గురు స్టార్ లతో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇక తెలుగులో ఖణ్మణి రాంబో ఖతీజా అనే టైటిల్ తో ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల ఎన్నో బ్రేకులు పడ్డాయి. ఫైనల్ గా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు రిలీజ్ చేస్తుండగా పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. అంతేకాదు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Into the world of #KRK ♥️♥️ #KRKTrailer ➡️https://t.co/ho0jB3h4Dh#KaathuvaakulaRenduKaadhal
A @VigneshShivN Original 🎬
An @anirudhofficial Musical 🥁@VijaySethuOffl #Nayanthara @Samanthaprabhu2 @Rowdy_Pictures @RedGiantMovies_ @SonyMusicSouth @proyuvraaj#KRKonApril28 pic.twitter.com/cwSk4SWKmH— Seven Screen Studio (@7screenstudio) April 22, 2022
కాగా ఈసినిమాలో ప్రముఖ క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోతో కలిసి విఘ్నేష్ శివన్ తన సొంత బ్యానర్ అయిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























