స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ తో 1050 కోట్లకు పైగా కలెక్ట్ చేసి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం హనుమాన్ దీక్షను తీసుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు. హనుమాన్ దీక్షలో భాగంగా 21 రోజుల పాటు దీక్షకు చెందిన క్రమశిక్షణను పాటిస్తున్నఎన్టీఆర్ లుక్ హనుమాన్ జయంతి సందర్భంగా బయటికి వచ్చింది. హనుమంతుని బొట్టు రంగులో ఉన్న దుస్తుల్లో ఎన్టీఆర్.. గెడ్డం పెంచి, మెడలో రుద్రాక్ష మాల వేసుకుని నుదుటున బొట్టుతో కనిపించారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























