అలియా-రణ్‌బీర్‌ పెళ్లి.. బ్రహ్మాస్త్ర టీమ్ స్పెషల్ విషెస్..!

Brahmastra team special wishes to Alia and Ranbir,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Movie Updates,Alia and Ranbir Marriage,Alia and Ranbir Special Journey,Isha and Shiva Marriage,Brahmastra Latest Movie Updates,Brahmastra Special Video,Brahmastra latest Video Released,Ranbir Kapoor and Alia Bhatt, Ranbir Kapoor And Alia Bhatt Special Video Released,Brahmastra Movie Mkaers special wishes to Alia and Ranbir,Special Video of Ranbir Kapoor And Alia Bhatt Movie Brahmastra,Ranbir Kapoor And Alia Bhatt Special Video Out Now, Makers of Brahmastra Released Special Video Ranbir Kapoor And Alia Bhatt

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్యనే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. హిందీతో పాటు సౌత్ లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా చిత్రయూనిట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆయా భాషల్లో ఉన్న ఫ్లేవర్ పోకుండా ఉండటానికి.. సహజంగా ఉండటానికి ఏ లాంగ్వేజ్ కు తగ్గట్టు ఆయా లాంగ్వేజస్ లో ప్రముఖ లిరిసిస్ట్ లతో లిరిక్స్ రాయిస్తున్నారట. మరోవైపు దానికి తగ్గట్టే ప్రమోషన్లు కూడా చేయాలని కూడా ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఇప్పటికే సౌత్ ప్రమోషన్స్ బాధ్యతను రాజమౌళి తీసుకున్నారు. మరి రాజమౌళి ప్రమోషన్స్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రణ్ బీర్ అలానే అలియా ఎప్పటినుండో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే
గత కొద్దికాలంగా వీరిద్దరి పెళ్లి పై పలు వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. ఆ వార్తలు ఈమధ్య మరింత ఎక్కువయ్యాయ. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆవార్తలకు క్లారిటీ వచ్చేసింది. బ్రహ్మాస్త్ర టీమ్ నేడు తమ ట్విట్టర్ వేదికగా స్పెషల్ విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. త్వరలో కొత్త జర్నీని స్టార్ట్ చేయబోతున్న శివ, ఇషాలకు బ్రహ్మాస్త్ర టీమ్ నుండి బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేశారు.

కాగా బ్రహ్మాస్త్ర సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ తో పాటు టాలీవుడ్ అగ్రహీరో నాగార్దున కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.