టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హాలీవుడ్ టెక్నాలజీ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. సోనాల్ చౌహాన్ “ఆదిపురుష్”మూవీ లో కీలకపాత్రకై ఎంపిక అయ్యారు. ఒక ఇంటర్వ్యూ లో సోనాల్ మాట్లాడుతూ .. “ఆదిపురుష్”మూవీలో తానూ భాగం అయ్యాననీ , చాలా ఎగ్జయిట్ అవుతున్నాననీ , తన కెరీర్ లోనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనీ , “ఆదిపురుష్”మూవీ ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారనే నమ్మకంతో ఉన్నాననీ చెప్పారు. సోనాల్ ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న “ది ఘోస్ట్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: