రాజమౌళి : స్వప్న సినిమా బ్యానర్ పైఎస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “స్టూడెంట్ నెం 1” మూవీ తో ఎస్ ఎస్ రాజమౌళి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడు రాజమౌళి ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. “సింహాద్రి “, “సై “, “ఛత్రపతి “, “విక్రమార్కుడు “, “యమదొంగ “, “మగధీర “, “మర్యాద రామన్న “, “ఈగ “,”బాహుబలి “, “బాహుబలి 2” వంటి సూపర్ హిట్ మూవీస్ తో రాజమౌళి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “బాహుబలి “మూవీ తో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరటాల శివ : యు వి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ , అనుష్క జంటగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “మిర్చి “మూవీ తో కొరటాల శివ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు.”శ్రీమంతుడు”, “జనతా గ్యారేజ్”, “భరత్ అనే నేను” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కొరటాల శివ సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడిగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. సందేశాత్మక మూవీస్ తో కొరటాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ : “స్వయంవరం “మూవీ తో స్టోరీ , డైలాగ్ రైటర్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ హిట్”నువ్వే కావాలి “, “నువ్వు నాకు నచ్చావ్ ” మూవీస్ కు రైటర్ గా పనిచేశారు. “నువ్వే నువ్వే “మూవీ తో త్రివిక్రమ్ దర్శకుడిగా మారి “అతడు”,”జల్సా”, “జులాయి”, “అత్తారింటికి దారేది”, “S/O సత్యమూర్తి “, “అ ఆ”, “అరవింద సమేత వీరరాఘవ”, “అల .. వైకుంఠపురము లో ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో డైలాగ్స్ , తన దర్శకత్వ ప్రతిభతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రేక్షకులను అలరించారు.
సుకుమార్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “ఆర్య ” మూవీ తో సుకుమార్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆర్య మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన సుకుమార్ బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ , బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.”ఆర్య 2 “, “100%లవ్”, “నాన్నకుప్రేమతో “, “రంగస్థలం “, “పుష్ప :ది రైజ్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో సుకుమార్ ప్రేక్షకులను అలరించారు.
బోయపాటి శ్రీను : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “భద్ర “మూవీతో బోయపాటి శ్రీను దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “సింహా”, “లెజెండ్”, “సరైనోడు”,”అఖండ “వంటి సూపర్ హిట్ మూవీస్ ను అద్భుతంగా తెరకెక్కించి బోయపాటి ప్రేక్షకులను అలరించారు. భారీ యాక్షన్ సీన్స్ తో మాస్ మసాలా మూవీస్ తెరకెక్కించడంలో బోయపాటి సిద్ధహస్తుడిగా మారారు.
అనిల్ రావిపూడి : ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ యాక్షన్ కామెడీ “పటాస్ ” మూవీ తో అనిల్ రావిపూడి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “సుప్రీమ్ “, రాజా ది గ్రేట్ “, “F 2 :ఫన్ &ఫ్రస్టేషన్”, “సరిలేరు నీకెవ్వరు”వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన కామెడీ టచ్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడిగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “F 2 :ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ సీక్వెల్ “F 3″మూవీమే 27 వ తేదీ రిలీజ్ కానుంది.
[totalpoll id=”77892”]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























