కెరీర్ లో స్టార్టింగ్ లోనే వరుస హిట్లు అందుకొని టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ. అయితే రీసెంట్ గా వరుస ఫ్లాప్స్ ను అందుకున్నాడు. ‘టాక్సీవాలా’ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలు సక్సెస్ కాలేదు. దీంతో అటు విజయ్.. ఇటు ఫ్యాన్స్ కూడా విజయ్ నుండి మంచి హిట్ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో లైగర్ సినిమా వస్తుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కాగా 2022, ఆగస్ట్ 25న లైగర్ సినిమా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు మరో సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను విజయ్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇక నేడు ఈసినిమాను లాంచ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని ముంబైలో ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమంలో విజయ్, పూరీ జగన్నాథ్, ఛార్మీ, వంశీ పైడిపల్లి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ..పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మరోసారి పని చేయడం సంతోషంగా ఉందని అన్నాడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఓ భాగం కావడం తనకు ఆనందాన్ని కలిగించిందని విజయ్ అన్నాడు. ఇక ఈ సినిమాలో తన పాత్ర చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుందని ఆయన తెలిపాడు.
కాగా ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రూపుదిద్దుకోనుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేసేశారు. 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
More madness.
The next one year of my life.Worldwide Release – Aug 3, 2023. pic.twitter.com/bAvRwEAS63
— Vijay Deverakonda (@TheDeverakonda) March 29, 2022




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























